Natyam ad

యువతను రెచ్చగొట్టడం మానుకోవాలి-చంద్రబాబు పద్దతి మార్చుకోవాలి.

*మైనార్టీల పక్షపాతి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
*పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.

రొంపిచెర్ల ముచ్చట్లు:

Post Midle

యువతను రెచ్చగొట్టడం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు మానుకోవాలని ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి అన్నారు. ఆయన స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడుతూ పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గెలవలేక యువతను మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు సీఎంగా 14 సంవత్సరాలు పని చేసినా చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డిని ఏమీ చేయలేకపోయారని అన్నారు. ప్రతి ఎన్నికల్లోను చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదుర్కొంటున్నారని తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముస్లీంల పక్షపాతి అని అన్నారు. రొంపిచెర్లకు చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనాయతుల్లా అనారోగ్యంతో మృతి చెందితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ రూ.10 లక్షలు మంజూరు చేయించి, పంపిణీ చేశారని తెలిపారు. ప్రస్తుతం పీలేరు సబ్ జైల్లో ఉన్న కరీం తండ్రి జానీభాష మృతి చెందితే వైఎస్ఆర్ భీమా పథకంలో ఆ కుటుంబానికి రూ.2 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉండగా చిత్తూరు జిల్లాలో ముస్లీం సోదరులకు ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.10 లక్షలు మంజూరు చేసి ఇచ్చారా అని ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డిని ఓడించడం చంద్రబాబు తరం కాదన్నారు. కిషోర్ కుమార్ రెడ్డి వార్డు మెంబర్ గా కూడా గెలవలేదన్నారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చల్లాబాబుతో కలిసి పుంగనూరు నియోజకవర్గంలో యువతను రెచ్చగొడుతూ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. జెడ్పీటీసీ రెడ్డీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 7 తేదీన రొంపిచెర్లలో జరిగిన ఘర్షణలకు చల్లాబాబు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిదే బాధ్యత అన్నారు.

 

పీలేరు నుంచి టీడీపీ రౌడీలను, గుండాలను రొంపిచెర్లకు పంపి దాడులు చేయించారని ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలకు, కుల, మతాలకు అతీతంగా అందిస్తున్నామని తెలిపారు. యువత టీడీపీ నాయకుల ఉచ్చలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. రొంపిచెర్లలో చల్లాబాబు దాడులు చేయించి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలపై దాడులు చేయించి మంత్రి పెద్దిరెడ్డి పై నిందలు వేస్తున్నారని అన్నారు. ఎవరు దాడులు చేయిస్తున్నారో నియోజకవర్గంలో అందరికీ తెలుసని అన్నారు. ఇప్పటికైనా దాడులు చేయించడం మానుకొని, రాక్షసానందం పొందడం తగ్గించుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి సలీంభాష, వైస్ ఎంపీపీ విజయ శేఖర్, సర్పంచ్ నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సూర్యనారాయణ రెడ్డి, కమలాకర్ రెడ్డి, కరీముల్లా, మహబూబ్ భాషా, సుంకేసుల ఖాదర్ బాషా, సురేంద్రనాయుడు, శేషాద్రి నాయుడు, అబూబకర్, భాస్కర్ రెడ్డి, బాబు, సుధాకర్ రెడ్డి, సైఫుల్లా ఖాన్, ఖాజాపూర్, ఇజాజ్ భాష, భాయ్, రెడ్డి శేఖర్ రెడ్డి, ఉమాపతి రెడ్డి, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Avoid provoking the youth – Chandrababu should change his method.

Post Midle