జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రవీంద్ర భారతి నందు ఆర్. కె సాంస్కృతిక సాహిత్య అకాడమీ వారు నిర్వహించే ఉగాది పురస్కారానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ గ్రామానికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు, యువకవి, రచయిత అయినటువంటి డా. సామల శశిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్నట్ట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత19సంవత్సరాలుగా ఒక ప్రైవేట్ ఉపాధ్యాయునిగా మాతృ భాష సంఘం పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా తెలుగు భాష పట్ల మమకారంతో తెలుగు భాష అభివృద్ధి కొరకు పాటు పడినటువంటి సామల శశిధర్ రెడ్డి ఒక కవిగా, రచయితగా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ ఉగాది పురస్కారానికి ఎంపిక చేసినట్లు రంజిత్ కుమార్ పేర్కొన్నారు. తానుపనిచేసినటువంటిపాఠశాలల్లోతెలుగుసమూహాలను ఏర్పాటు చేసి మాతృభాషా దినోత్సవం రోజున ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించి తెలుగు భాష అభివృద్ధికి పాటుపడుతూ తెలుగు భాష మన అమ్మ భాష అని తెలుగును మన అమ్మ లాగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చాటి చెబుతూ తెలుగు అభ్యున్నతికి పాటు పడుతున్న శశిధర్ రెడ్డి కి ఈ అవార్డు అందుకున్నందు చాలా సంతోషంగా ఉందని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.