Natyam ad

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న గోరటి వెంకన్న..

హైదరాబాద్: ఎన్నో గొప్ప పల్లె పాటలతో సంచలనం సృష్టించిన కవి, రచయిత, తెరాస ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఇవాళ దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ చేతుల మీదుగా ఈ అవార్డును గోరటి వెంకన్న అందుకున్నారు. ఆయన రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి గానూ 2020-21 ఏడాదికి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ ఈ పురస్కారం ప్రకటించింది. నాగర్ కర్నూల్ జిల్లా గౌరారంలో 1963లో జన్మించిన గోరటి వెంకన్న.. ‘వల్లంకి తాళం’తో పాటు అచ్చమైన పల్లెపదాలతో ఏకునాదం మోత, రేలపూతలు, అల సెంద్రవంక, పూసిన పున్నమి తదితర పుస్తకాలు రచించారు..