పుంగనూరుకు చెందిన గోపి కి డాక్టరేట్ ప్రదానం
పుంగనూరు :
పుంగనూరు పట్టణం తాటిమాకుల పాళ్యం కు చెందిన జి . గోపి కి డాక్టరేట్ ప్రదానం చేశారు. జెఎన్టియు అనంతపురము లో ఫార్మాసూటికల్ సైన్సెస్ విభాగం లో “డిజైన్ డెవలప్మెంట్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ నికర్డిపిన్ హెచ్సిఎల్ నానో పార్టీక్యూ లార్ ఫార్ ములేషన్స్ అనే అంశం పై పరిశోధన చేసినట్లు ఆయన తెలిపారు. రత్నం ఫార్మసీ కాలేజ్ నెల్లూరు డాక్టర్ బి . కుమార్ , కృష్ణ యూనివర్సిటీ ఎక్స్ వైస్ ఛాన్సలర్ కే. బీ. చంద్రశేఖర్ పర్య వెక్షణలో చేసిన పరిశోధనలకుపిహెచ్డి ప్రదానం చేసినట్టు తెలిపారు.ఇతను ప్రస్తుతం మహతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మదనపల్లె లో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టరేట్ పొందిన గోపి కి కళాశాల చైర్మన్,ప్రిన్సిపల్,ప్రొఫెసర్స్ సుబా కాంక్షలు తెలిపారు.
Tags: Awarded doctorate to Gopi from Punganur

