పుంగనూరు ముచ్చట్లు:
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన మండలంలోని గూడూరుపల్లి హైస్కూల్ టీచర్ టిఆర్.రాజేష్‌ను డీఈవో దేవరాజులు సన్మానించారు. వీరికి ప్రశంసాపత్రాలు , మెమెంటోలు అందజేశారు. రాజేష్ 1998లో ఉపాధ్యాయుడుగా చేరారు. కాగా రాజేష్ తమ పాఠ్యాంశాల బోధనలో విశేష ప్రతిభ కనపరిచారు. అలాగే 2009 నుంచి రెండు సంవత్సరాల పాటు సాక్షి విద్య పేజిలో ఆయన ప్రతిరోజు ప్రత్యేక అంశాలను వివరించేవారు. ఇందులో గణితము, ఫిజిక్స్కు సంబంధించి డీఎస్సీ అభ్యర్థులకు ప్రత్యేక అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. రాజేష్‌ను పలువురు అభినందించారు.
Tags: Awarded to Rajesh as the best teacher