వృత్తి నైపుణ్యం కనబరిచిన 15 మంది భద్రతా సిబ్బందికి అవార్డులు
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఉత్తమ సేవలు అందించి వృత్తి నైపుణ్యం కనబరిచిన 15 మంది నిఘా మరియు భద్రతా సిబ్బందికి టిటిడి సివిఎస్వో గోపినాథ్‌జెట్టి బుధవారం మెరిటోరియస్ అవార్డులు అందజేశారు. తిరుమలలోని పిఏసి-4లో గల కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఈ కార్యక్రమం జరిగింది.భక్తులు పోగొట్టుకున్న బంగారు, వెండి వస్తువులను సిసి టివిల ద్వారా వెతికి ఇవ్వడం, భక్తులు పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు తిరిగి అందించడం, తప్పిపోయిన చిన్నపిల్లలు, వృద్ధులను తిరిగి వారి కుటుంబ సభ్యులకు అందజేయడం, భారీ వర్షాల సమయంలో జిఎన్‌సి టోల్‌గేట్, ఘాట్ రోడ్డులో ఉత్తమంగా విధులు నిర్వహించినవారికి ఈ అవార్డులు అందించారు.అవార్డులు అందుకున్నవారిలో కెజె.నాగరాజు, వి.రఘునాథరెడ్డి, ఎస్.సుధాగరన్, కె.వాసు వర్మ, బి.ఉదయ్‌కుమార్, ఆర్.కుమార్, సి.దుర్గ, పి.హరినాథ్, వి.రఘు, డి.శ్రీనివాసులు, పి.వాణి, ఎన్ఆర్.సహదేవరెడ్డి, ఎస్.రెడ్డి కిషోర్, వి.వెంకటేష్, ఎస్.పలణికుమార్ ఉన్నారు.ఈ కార్యక్రమంలో టిటిడి విజివో జి.బాలిరెడ్డి, వివిధ సెక్టార్ల ఏవిఎస్వోలు, విఐలు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Awards for 15 security personnel with professionalism