అవార్డులు మరింత బాధ్యతలను పెంచుతాయి పేదల “డాక్టర్  రామేశ్వరి”కి జగిత్యాల ప్రెస్ క్లబ్ పురస్కారం

జగిత్యాల  ముచ్చట్లు:

సమాజంలో గుర్తింపు రావడం కోసం ప్రతీ ఒక్కరు కృషిచేస్తారని కానీ అందులో కొందరికే లభిస్తుందని జగిత్యాలకు చెందిన ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ రామేశ్వరి అన్నారు. జగిత్యాల పట్టణంలో గత 30 సంవత్సరాలుగా పేదలకు అందుబాటులో ఉండేవిధంగా వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్ రామేశ్వరికి జగిత్యాల ప్రెస్ క్లబ్ పక్షాన ఉగాది పురస్కారాన్ని బుధవారం అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు అందజేశారు.
ఈసందర్బంగా డాక్టర్ రామేశ్వరి మాట్లాడుతూ ఇప్పటి పరిస్థితుల్లో సమాజంలో గుర్తింపు రావడం అదృష్టమన్నారు. మంచివారిని ఆదర్శoగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. జగిత్యాల ప్రెస్ క్లబ్ పక్షాన నాకు అవార్డు ఇవ్వడం సంతోషకరమన్నారు. అవార్డులు మరింత బాధ్యతలను పెంచుతాయని  డా. రామేశ్వరి చెబుతూ జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశిష్ట సేవాలాంధించిన 11మంది ప్రముఖులకు ప్రెస్ క్లబ్ పక్షాన ఉగాది పురస్కారాలు అందించామని, అందులో భాగంగానే వైద్యరంగంనుండి డాక్టర్ రామేశ్వరికి అందజేశామన్నారు.  వైద్యం పేద ప్రజలకు అందకుండా కార్పొరేట్ స్థాయిలో ఉన్న పరిస్థితుల్లోను  సామాన్యులకు అందుబాటులో వైద్యం అందిస్తూ పేదల డాక్టర్ గా రామేశ్వరి గుర్తింపు పొందారని చెప్పారు. పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకొన్న రామేశ్వరి పేదల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు అజయ్ రెడ్డి, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు గుండేటి రాజు, పొన్నం లావణ్య, మాకు రాజలింగం, భూమి వేణుమాధవ్, మాన్యం రవికుమార్, చింత రోజా, కృష్ణ కుమార్, భాను, శ్రీనివాసా చారి, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Awards increase more responsibilities
Jagittala Press Club Award for the poor “Dr. Rameshwari”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *