కరోనా వారియర్స్ కు అవార్డులు

విశాఖపట్నం  ముచ్చట్లు:
కరోనా మహమ్మారి విజృంభణకు భయపడకుండా ప్రజలకు వివిధ రంగాల్లో  సేవలందించిన వారిని న్యూ హోప్ ఫౌండేషన్ గుర్తించి సత్కరించడం ఎంతో గొప్ప విషయమని శాసనమండలి సభ్యుడు పీ.వీ.ఎన్ మాధవ్ అన్నారు.   అయన నివాసంలో న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ మంచా నాగ మల్లీశ్వరి ఆధ్వర్యంలో కరోనా వారియర్స్ అవార్డు పోస్టర్ ను విడుదల చేసారు.ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ కరోనా సమయంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతోమంది సేవలందించారన్నారు.  అటువంటివారిని సత్కరించడానికి మల్లేశ్వరి ముందుకురావడం ఆనందంగా ఉందన్నారు.  బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ మాట్లాడుతూ మల్లేశ్వరి చేస్తున్న కరోనా వారియర్స్ అవార్డు ల కార్యక్రమంలో  తాను కూడా భాగస్వామిని కావడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ మంచా నాగ మల్లీశ్వరి మాట్లాడుతూ కరోనా వారియర్స్ ను గత సంవత్సరం కూడా అవార్డులతో సత్కరించామని ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ లో సమర్ధంగా సేవలనందించిన  మరికొంతమంది వారియర్స్ ను  అవార్డులకు ఎంపిక చేసి ఘనంగా సత్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 22 వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, ప్రవీణ,బీజేవైఎం నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Awards to the Corona Warriors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *