ఆడబిడ్డకు రక్షణగా 21న అవగాహన సదస్సు

Awareness Conference on Protection of the Mother of 21

Awareness Conference on Protection of the Mother of 21

Date:19/05/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలో చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న ఆదేశాల  మేరకు 21న సోమవారం ఆడబిడ్డలకు రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌వర్మ తెలిపారు. ఉదయం 9:30 గంటలకు గోకుల్‌ సర్కిల్‌ నుంచి మున్సిపాలిటి వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వర్మ మాట్లాడుతూ నేటి సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి రక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కార్యక్రమంలో వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి  చైర్ పర్సన్  షమిమ్‌షరీఫ్‌,  వైస్ ఛైర్మెన్  ఆవుల అమరేంద్ర, వార్డుమెంబర్లు, కో-ఆప్షన్‌ మెంబర్లు, పట్టణ జన్మభూమి కమిటి మెంబర్లు, మహిళా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు హాజరుకావాలని కోరారు.

 

Tags: Awareness Conference on Protection of the Mother of 21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *