Natyam ad

ప్రమాదాలలో అవగాహన ముఖ్యం-ఫైర్‌ ఆఫీసర్‌ సుబ్బరాజు

పుంగనూరు ముచ్చట్లు:

ఎలాంటి ప్రమాదాలు సంభవించినా ప్రజలు సహనం కోల్పోకుండ ధైర్యంతో ప్రమాదం నుంచి బయట పడేలా మనోదైర్యం కలిగి ఉండాలని ఫైర్‌ ఆఫీసర్‌ సుబ్బరాజు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌, ఆర్‌ఐ హరికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ వరదలు, అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, విష సర్పాల భారీన పడకుండ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. వరదల్లో తేలికైన రబ్బర్‌ట్యూబ్‌లు, బెండ్‌లను పట్టుకుని ఉంటే మునిగిపోయే ప్రమాదం ఉండద న్నారు. అలాగే విష సర్పాల భారీన పడినప్పుడు తక్షణమే బాధితున్ని వైద్యశాలకు తరలించాలన్నారు. ప్రమాదాల సమయంలో ప్రజలు ఆందోళన చెందకుండ ప్రమాదాల నుంచి బయటపడేందుకు అక్కడ పరిస్థితులను బట్టి ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది హాజరై రకరకాల విన్యాసాలను నిర్వహించారు. లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: Awareness is important in accidents – Fire Officer Subbaraju