పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ లో విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన

పుంగనూరు ముచ్చట్లు:

ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2023 కార్యక్రమంలో భాగంగా పుంగనూరు మున్సిపాలిటీ వారు స్థానిక రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ లో విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయుట గురించి మరియు తరగతి గదులను, విద్యార్థుల ఇంటి పరిసరాలలోనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. విద్యార్థులు ఈ విషయాలపై వారి తల్లిదండ్రులకు ,ఇరుగుపొరుగు వారికి అవగాహన కల్పించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు I S L 2023 ఆకారం లో కూర్చుని తమ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:Awareness of cleanliness among students in Punganur Rayalaseema Children’s Academy

Leave A Reply

Your email address will not be published.