వ్యాపారులకు సైబర్ నేరాల అవగాహన
మార్కాపురం ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ స్టేషన్ ఆవరణంలో డిఎస్పి రఘు వీరారెడ్డి అధ్యక్షతన సైబర్ నేరాల పై వ్యాపారస్తులందరికీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ రోజురోజుకీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని వ్యాపారస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు., ప్రతి ఒక్క షాపు నందు సీసీ కెమెరాలు బిగించుకోవాలని, తెలిపారు.మీ ఫోన్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వొద్దని, మీకు ఏమన్నా అనుమానం వస్తే మమ్మల్ని సంప్రదించమని, మోసగాళ్ల మాయలో పడొద్దు అని కోరారు. ఈ సమావేశంలో సిఐ భీమా నాయక్, పట్టణ ఎస్సై శశి కుమార్, రూలర్ ఎస్ఐ సుమన్ పట్టణ పోలీస్ సిబ్బంది మరియు వ్యాపారస్తులు పాల్గొన్నారు.
Tags: Awareness of cybercrime for businesses