కాలుష్య నివారణ , చట్టాలపై అవగాహన ఎంతో అవసరం

Awareness on pollution prevention and legislation is essential

Awareness on pollution prevention and legislation is essential

– న్యాయమూర్తి బాబునాయక్‌

Date:05/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు , చట్టాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరు చైతన్య వంతులు కావాలని పుంగనూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఎఫ్‌ఆర్‌వో గోవిందరాజన్‌ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. అలాగే ఆవరణంలో వెహోక్కలు నాటే కార్యక్రమాన్ని న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి బాబునాయక్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ఇంటి ముందు వెహోక్కలు పెంచాలన్నారు. అలాగే ప్లాస్టిక్‌ను పూర్తిగా నియంత్రించాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండ చెత్త కుండీలలో వేసి, హ్గంకంపోస్ట్ విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఖాళీ స్థలాల్లో ఐకమత్యంతో పార్కులు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అలాగే ప్రస్తుత సమాజంలో చట్టాలపై అవగాహన లేకపోవడంతో అమాయకులైన ప్రజలు మోసపోతున్నారని న్యాయమూర్తి తెలిపారు. ప్రతి ఒక్కరు చదువుకుని సంతకం చేయడం అలవర్చుకోవాలన్నారు. తెలియని పరిస్థితుల్లో తెలుసుకుని అవగాహన చేసుకోవడం కర్తవ్యమన్నారు. న్యాయస్థానాలకు సాక్ష్యంగా పత్రాలు అవసరమని అవి లేకుండ మాటలతో కేసులు నిరూపణ కాకపోతుందని న్యాయమూర్తి తెలిపారు. ప్రతి ఒక్కరు ఏ సమస్యనైనా వ్రాతమూలకంగా చేసుకోవడం మంచిదన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు పులిరామక్రిష్ణారెడ్డి, ఏజిపి ప్రభాకర్‌నాయుడు, లోక్‌ అదాలత్‌ మెంబర్లు ప్రశాంతి, సుబ్రమణ్యం, ఆర్‌ఐ రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీలకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలి

Tags: Awareness on pollution prevention and legislation is essential

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *