ట్రాఫిక్ రాయితీలపై అవగాహన

మహబూబాబాద్ ముచ్చట్లు:
 
మహబూబాబాద్ ప్రాంత వాహనదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశాలతో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్,డీఎస్పీ సదయ్య నేతృత్వంలో ట్రాఫిక్ జరిమానాలపై రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు ప్రకటించినట్లు మహబూబాబాద్ ట్రాఫిక్ ఎస్సై గాలిబ్ వాహనదారులకు వివరించారు.  వాహనదారులకు టూవీలర్స్, త్రీవీలర్స్ పైన ఉన్న చాలాన్లపై  75 శాతం రాయితీ ఇస్తున్నందున మిగిలిన 25 శాతం సొమ్ము కడితే సరిపోతుందని,ఇతర వాహనాలకు 50 శాతం రాయితీతో మిగిలిన 50 శాతం సొమ్ము కడితే సరిపోతుంది.  ఈ యొక్క రాయితీ ఈనెల మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం వర్తిస్తున్నందున, మీ దగ్గరి లోని మీ సేవ కేంద్రాల్లో ఆ సొమ్ము చెల్లించాలని,కావున వాహనదారులు ఈ రాయితీ అవకాశం వినియోగించుకుని మీ యొక్క వాహనాలపై పెండింగ్లో ఉన్న చాలన్స్ మొత్తం చెల్లించి క్లియరెన్స్ చేసుకోవాలని ఆయన కోరారు.
 
Tags: Awareness on traffic concessions

Leave A Reply

Your email address will not be published.