Awareness program on cotton crop for farmers

రైతులకు పత్తి పంట పై అవగాహన కార్యక్రమం

Date:25/09/2020

తుగ్గలి  ముచ్చట్లు:

తుగ్గలి మండల పరిధిలోని పగిడిరాయి గ్రామంలో వ్యవసాయాధికారులు రైతులకు పత్తి పంట పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.పగిడిరాయి గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం రోజున విఏఏ నాగార్జున ద్వారా వ్యవసాయ విస్తరణ అధికారి జిలాన్ బాష పత్తిలో గులాబీరంగు పురుగు నివారణ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ కొరకు లింగాకర్షక బుట్టలను ఏర్పరుచుకోవాలని రైతులకు తెలియజేసి లింగాకర్షణ బుట్టలు యొక్క ఉపయోగాల గురించి వివరిస్తూ పత్తి పొలంలో ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ గోపాల్,వీఆర్వో రంగన్న,గ్రామ వాలంటీర్లు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు మాస్క్ లు విరాళం

Tags: Awareness program on cotton crop for farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *