గుండె పోటుపై అవగాహనా కార్యక్రమం

Date:17/10/2020

కాకినాడ   ముచ్చట్లు:

మనదేశంలో ఆకస్మాత్తుగా గుండె ఆగడం వల్ల సంభవించే మరణాలను తగ్గించే విషయంలో భారతీయ హృదయ పునరుత్తేజిత మండలి కీలకపాత్ర పోషిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ప్రపంచ అనస్థీసియా, ప్రపంచ రీస్టార్ట్ ఏ హార్ట్ డే సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఐఆర్సీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి తదితరులతో కలిసి మంత్రి కన్నబాబు హాజరయ్యారు. దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత వైద్య నిపుణులతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఐఆర్సీ నిర్వహిస్తున్నశిక్షణ కార్యక్రమాలతో ఎంతో మంది ప్రాణాలు నిలబడుతున్నాయని పేర్కొన్నారు. అకస్మాత్తుగా గుండె ఆగి, ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు రెండు చేతులతో ఛాతిపై నొక్కి తిరిగి ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చేలా చేసే ప్రక్రియపై పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన తక్కువగా ఉందని వెల్లడించారు.

 

 

 

ఈ నేపథ్యంలో గ్రామ/వార్డు సచివాలయాలు కేంద్రంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఐఆర్సీకి సూచించారు. వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటుచేసే వైఎస్సార్ హెల్త్ క్లినిక్ల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. కోవిడ్-19 క్లిష్ట సమయంలో వైద్యులు రాత్రి, పగలూ అనే తేడాలేకుండా విశేష సేవలందించారని, ఆ సేవలు మరువలేనివని ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఐఆర్సీ మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయసహకారాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో వైద్యులతో కలిసి ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు ఐఆర్సీ తపాలాబిళ్లలు, కవర్లను ఆవిష్కరించారు. ప్రతి కుటుంబంలో ఒకరికి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఐఆర్సీ ఛైర్మన్ డాక్టర్ ఎస్ఎస్సీ చక్రరావు తెలిపారు.

ప్రకాశం బ్యారేజికి భారీ వరద

Tags: Awareness program on heart attack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *