ఓటర్ దినోత్సవ సందర్భంగా అవగాహన ర్యాలీ

-అధికారుల సమక్షంలో ఓటరు ప్రతిజ్ఞ నిర్వహణ

Date:25/01/2021

తుగ్గలి  ముచ్చట్లు:

ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండల అధికారులు ఓటర్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు.మండల కేంద్రమైన తుగ్గలి లో సోమవారం రోజున స్థానిక తుగ్గలి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి యందు ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు.ఓటర్ల దినోత్సవం సందర్భంగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.18 సంవత్సరాలు పైబడిన యువతీ యువకులు అందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేశారు.ప్రస్తుత సమాజంలో ఓటు హక్కు ఒక వజ్రాయుధం అని, భారత దేశంలో నివసించే ప్రతి పౌరుడు ఓటు హక్కు పొందాలని అధికారులు తెలియజేశారు.ఓటర్ల దినోత్సవం సందర్భంగా అధికారులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల చేత ప్రధాన రహదారి పై ఓటర్ల ప్రతిజ్ఞ నిర్వహించారు. ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేవారు మీసేవ ద్వారా గాని,బూత్ లెవెల్ ఆఫీసర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, విఆర్ఓ నాగేంద్ర,తుగ్గలి ఎస్సై నాగేంద్ర, ప్రధానోపాధ్యాయులు నాగేంద్ర, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ పులి శేఖర్,గ్రామ వాలంటీర్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌   త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tags: Awareness rally on the occasion of Voter Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *