సచివాలయ ఉద్యోగుల అభ్యర్థులకు అవగాహన సదస్సు

Awareness seminar for candidates of Secretariat employees

Awareness seminar for candidates of Secretariat employees

Date:25/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు అవగాహన సదస్సును ఆదివారం నిర్వహించారు. మండలంలోని జువ్వలదిన్నితాండాలో గిరిజన సంఘ నాయకుడు డాక్టర్‌ బాణావత్‌ మునీంద్రనాయక్‌ ఆధ్వర్యంలో అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాగేనాయక్‌ మాట్లాడుతూ అభ్యర్థులు ప్రణాళిక బద్ధంగా కష్టపడాలని సూచించారు. ముఖ్యంగా పరీక్షల్లో ప్రభుత్వ పథకాలు, వాటిపై విశ్లేషణను అభ్యర్థులు అవగాహన చేసుకోవాలన్నారు. పరీక్షల సమయంలో తొందరపాటుకు లోనుకాకుండ సావదానంగా ప్రశ్నపత్రాలను చదివి, వ్రాయడం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మునీంద్రనాయక్‌, శీనునాయక్‌, శీన, రాఘవేంద్రరావు నాయక్‌, ప్రభాకర్‌నాయక్‌, రామారావు, ప్రసాద్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫారెస్ట్ రేంజర్‌ను సస్పెండ్‌ చేయాలని విలేకర్లు ధర్నా రాస్తారోకో

Tags: Awareness seminar for candidates of Secretariat employees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *