విద్యార్థులకు అవగాహన సదస్సు

గూడూరు ముచ్చట్లు:

స్వాతంత్ర సమరంలో భారతీయ జెండా యొక్క విశిష్టత తెలియజేసేందుకు విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు గూడూరు మున్సిపల్ కమిషనర్  సాయినాథ్ తెలిపారు .  గూడూరు పట్టణంలోని  చిల్లకూరు  శేషమ్మ  ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జాతీయ జెండా పై అవగాహన సదస్సు నిర్వహించారు .దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా  కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవం  కార్యక్రమం  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది .  ఈ కార్యక్రమాల్లో భాగంగా  మన జాతీయ జెండా యొక్క ఆవశ్యకతను తెలియజేసే  అవగాహన సదస్సులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు . ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని చిల్లకూరు  శేషమ్మ  ఉన్నత  పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ సాయినాథ్  మాట్లాడుతూ మన జాతీయ జెండా  రూపొందించేందుకు మన ఆంధ్రుడు అయినటువంటి పింగళి వెంకయ్య 30 దేశాల యొక్క జాతీయ జెండా ల పై పరిశోధనలు జరిపి మన జాతీయ జెండా రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు . జాతీయ జెండా ద్వారా మన దేశం యొక్క గొప్పతనాన్ని  ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా రూపొందించడం జరిగిందని వివరించారు .  ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

 

Tags: Awareness seminar for students

Leave A Reply

Your email address will not be published.