నూతన సర్పంచులకు విధులు నిధుల గురించి అవగాహన సదస్సు

సర్పంచులు అందరూ పంచాయతీ రాజ్ చట్టాలపై అవగాహన కలిగివుండాలి
నంద్యాల సబ్ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్

నంద్యాల  ముచ్చట్లు:
నంద్యాల రెవెన్యూ డివిజన్ లో  నూతనముగా ఎన్నిక కాబడిన గ్రామ సర్పంచ్ ల శిక్షణ శిబిరాన్ని నంద్యాల సబ్ కలెక్టర్  చహత్ బాజ్ పాయ్ ప్రారంభించారు.గురువారం నంద్యాల ఆర్ అండ్ బీ. అతిథిగృహం నకు సమీపంలోని సీ యల్ ఆర్  భవనంలో జరిగిన నంద్యాల రెవెన్యూ డివిజన్ లో  నూతనముగా ఎన్నిక కాబడిన గ్రామ సర్పంచ్ ల శిక్షణ శిబిరాన్ని కి నంద్యాల సబ్ కలెక్టర్ హత్ బాజ్ పాయ్. మార్కుఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి. నంద్యాల డివిజనల్  డెవలప్మెంట్ అధికారి భాస్కర్ . డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.నంద్యాల సబ్ కలెక్టర్ మాట్లాడుతూ  నూతనంగా ఎన్నిక కాబడిన గ్రామ సర్పంచులు అందరూ పంచాయతీ రాజ్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని. వారికి ఇచ్చే ఈ మూడు రోజుల శిక్షణ లో గ్రామ సర్పంచులకు ఉన్నటువంటి విధులను. గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి నిధులను ఏ విధముగా ఖర్చు చేయాలి అన్న విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థ ప్రతి గ్రామంలోనూ ఏర్పడి ఉన్నదని వీరితో పాటు ప్రతి 50 గృహాలకు ఒక వాలంటరీ లను నియమించి ఉన్నారని ప్రతి సర్పంచి ఈ వ్యవస్థతో సమన్వయంగా వ్యవహరించి వారివారి గ్రామాలను అభివృద్ధి పథం వైపు నడిపించాలి అన్నారు.
మార్కుఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి మాట్లాడుతూ  మన  రాష్ట్ర  ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  బాపూజీ కలలు గన్న రామ రాజ్యం ఏర్పాటు కొరకే మన రాష్ట్రము లో ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థ ను ప్రవేశపెట్టిందని ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో 50 గృహాలకు ఒక వాలెంటర్ ని ఏర్పాటు చేసి వారి ద్వారా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటి గడప వద్దకు చేరుస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి గ్రామ సర్పంచి మన గౌరవ ముఖ్యమంత్రి  వర్యుల ఆశయాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అన్నారు. ప్రభుత్వము చేపట్టిన ప్రతి సంక్షేమ పథకం గ్రామాల్లో అమలు అయ్యేలా చూడటం ప్రతి సర్పంచ్ విధి అన్నారు.
డి ఎల్ డి ఓ.   భాస్కర్ .డివిజినల్ పంచాయితీ అధికారి శ్రీనివాసులు  మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచులకు మూడు రోజులపాటు ప్రాథమిక శిక్షణా కార్యక్రమమును ఏర్పాటు చేశారని ఈ కార్యక్రమం గురువారం నుండి ఆగస్టు నెల 14 వ తారీకు వరకు నిర్వహించబడతాయి అన్నారు. తొలుతగా మహిళామణులకు రెండు బ్యాచ్ లను ఏర్పాటు చేసి వారికి శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నుంచే ప్రారంభించామన్నారు. నంద్యాల డివిజన్ లోని 306 సర్పంచులకు గాను 4000 జనాభా లోపల ఉన్న 255 గ్రామ సర్పంచు లకు నంద్యాల యందు శిక్షణ ఇస్తారని తెలిపారు. నాలుగు వేల జనాభా దాటిన గ్రామ సర్పంచు లకు కాళహస్తి మరియు బాపట్ల లోని శిక్షణ ఆలయాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం లో సర్పంచులు సంపూర్ణంగా అవగాహన  చేసుకునేందుకు  పవర్ పాయింట్ ద్వారా  నైపుణ్యం గలిగిన  శిక్షకులు సుబ్రహ్మణ్యం శర్మ. వై పుల్లయ్య వారిచే శిక్షణ ఇస్తున్నామన్నారు..ఈ కార్యక్రమంలో డివిజన్ లోని గ్రామ సర్పంచులు. నంద్యాల ఏ పి డి. డివిజనల్ పంచాయతీ కార్యాలయం సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags:Awareness seminar on functions funding for new serpents

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *