లింగవివక్షతపై అవగాహన సదస్సులు

లింగవివక్షతపై అవగాహన సదస్సులు

పుంగనూరు ముచ్చట్లు:

సమాజంలోని లింగ వివక్షకు లోనౌతున్న వారిని ఆదరించేలా ప్రజల్లో అవగాహన సదస్సులు చేపట్టినట్లు మండల ఏపీఎం రవి తెలిపారు. శనివారం శక్తి భవన్‌లో మండల మహిళా సమాఖ్యల ప్రతినిధులచే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండర్లపై వివక్షత చూపకుండ ఉంటామని, ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. రవి మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు జెండర్‌ వివక్షతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డిసెంబర్‌ 23 వరకు జెండర్‌ వివక్ష వ్యతిరేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా జెండర్‌ ఆధారిత హింస, బాల్యవివాహాలు అరికట్టడం, రక్తహీనత, ఆడపిల్లలకు విద్య అనే అంశాలపై గ్రామ స్థాయి నుంచి చైతన్య సదస్సులు చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా గ్రూపుల ద్వారా గోడలపై రాతలు, కరపత్రాలు పంపిణీ, మీడియాలో ప్రచారం కల్పించడం నిర్వహించాలన్నారు. గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పెద్దలతో కలసి అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఇందులో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసి, జెండర్లు వివక్షతకు గురికాకుండ చూడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడంలో అందరు భాగస్వాములుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీసీలు శివశంకర్‌, గంగాధర్‌, నాగరత్న, శారదతో పాటు ఎంఎస్‌ఈ సభ్యులు ,ఎంఎస్‌వోబిలు పాల్గొన్నారు.

Tags: Awareness seminars on gender discrimination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *