పుంగనూరులో ఈఫార్మా మార్కెట్‌పై అవగాహన పెంచుకోవాలి

పుంగనూరు ముచ్చట్లు:

వ్యాపారులు కొనుగోలు చేసి , విక్రయించే పంటలను ఈఫార్మా మార్కెట్‌ ద్వారా లావాదేవిలు నిర్వహించేలా అవగాహన పెంచుకోవాలని ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి సూచించారు. బుధవారం మార్కెట్‌కమిటిలో కార్యదర్శి గోపి, సూపర్‌వైజర్‌ బాలాజితో కలసి ఈఫార్మా మార్కెట్‌పై వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. చైర్మన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యాపారులకు అనుకూలంగా ఉండేందుకు కొనుగోలు చేసిన సరుకులను ఈఫార్మా యాప్‌ ద్వారా క్రయవిక్రయాలు సాగించేలా అవగాహన పెంచుకోవాలన్నారు. దీని ద్వారా వ్యాపారులకు క్రయవిక్రయాలు సులభతరమౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు పాల్గొన్నారు.

 

Tags: Awareness should be raised about epharma market in Punganur

 

Leave A Reply

Your email address will not be published.