పుంగనూరులో ఉద్యోగులందరికి అవగాహన కల్పించాం

Date:24/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో నిర్వహించిన జాబ్‌మేళాలో ఎంపికై,నియామకపు పత్రాలు పొందిన ఉద్యోగులందరికి అవగాహన కల్పించినట్లు ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ 23 కంపెనీలలో నియమితులైన ఉద్యోగులందరికి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆరు మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ప్రజాప్రతినిధులు కలసి ఉద్యోగులకు పూర్తి అవగాహన కల్పించామన్నారు. ఏ పనినైనా రెండుమూడు నెలల పాటు చేయాలని, అలా చేసిన తరువాత ఆపనిలోని లోటుపాట్లు తెలుస్తుందని తెలిపారు. కంపెనీలలో చేరడం, పని చేయలేనని వదిలిరావడం లాంటివి చేయకుండ ప్రతి ఒక్కరు ఉపాధి సౌకర్యాలు పొందేందుకు పనుల్లో కొనసాగాలని సూచించినట్లు తెలిపారు. ఇంకను ఎవరికి ఏవిధమైన సలహాలు, సూచనలు కావాలన్న ఆయా మండల ఎంపీడీవోలను నేరుగా కానీ, ఫోన్‌లో కానీ కలసి సమస్యలు నివారించుకోవాలన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా జాబ్‌మేళాలో ఉద్యోగాలు పొందిన వారు ఆయా పదవుల్లో కొనసాగాలని ఆకాంక్షించారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌   త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tags: Awareness was created for all the employees in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *