ఆయేషామీరా రీ పోస్టుమార్టం పూర్తి

AYESHAMIRA RE POST MARKET COMPLETE

AYESHAMIRA RE POST MARKET COMPLETE

Date:14/12/2019

గుంటూరు ముచ్చట్లు:

బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్యకేసు మలుపుల మీద మలుపులు తిరుగుతూ చివరకు సీబీఐ విచారణ స్థితికి చేరింది. కొద్దిసేపటి క్రితం ఆయేషామీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం పూర్తైంది. ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం ఆధ్వర్యంలో ఆయేషా రీ పోస్టుమార్టం నిర్వహించింది. పుర్రె, అస్థికలపై చిట్లిన గాయాల పరిశీలించారు. అయేషా మీరా ఎముకల నుంచి అవశేషాలు ఫోరెన్సిక్‌ బృందం సేకరించింది. సీబీఐ ఎస్పీ విమల్‌ ఆదిత్య నేతృత్వంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ కార్యక్రమం ప్రొసీజర్‌ ప్రకారం, కుటుంబసభ్యుల సమక్షంలోనే నిర్వహించాలంటూ షరతులు విధించింది. విజయవాడలో 12 ఏళ్ల క్రితం ఆయేషా మీరా అత్యంత దారుణంగా హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే.

 

 

 

 

 

 

 

ఈ హత్యకేసులో విచారణ జరిపిన పోలీసులు అప్పట్లో మహిళా కోర్టుకు అందించిన ఆధారాల్లో చూపిన డీఎన్‌ఏ నిజంగా ఆమెదేనా అనే సందేహం రావటంతో సీబీఐ అధికారులు రీపోస్టుమార్టం కోసం కోర్టును ఆశ్రయించారు. తెనాలికి చెందిన ఆయేషామీరా ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కళాశాలలో భీఫార్మసీ చదువుతూ, దుర్గా హాస్టల్‌లో ఉండేవారు. ఆమె చేరిన మొదటి సంవత్సరంలోనే, 2007 డిసెంబర్‌ 27న హాస్టల్‌ గదిలో అత్యాచారం, హత్యకు గురయ్యారు. అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని దుర్మార్గులు పాల్పడిన ఈ దారుణ ఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. ఈ దారుణ హత్య వెనుక అప్పటి మంత్రి కోనేరు రంగారావు మనుమడు సతీశ్‌, అతని మిత్రులు ఉన్నారనే ఆయేషా తల్లి షంషాద్‌ బేగం ఆరోపణలు చేస్తున్నారు.

 

గోపీచంద్‌, సంపత్‌నంది కాంబినేషన్లో భారీ చిత్రం

 

Tags:AYESHAMIRA RE POST MARKET COMPLETE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *