Ayudha Puja for the uninterrupted distribution of Annaprasada to the devotees

భ‌క్తుల‌కు నిర్విఘ్నంగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ కోసం ఆయుధ‌పూజ

టిటిడి ఈవో  కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Date:26/10/2020

తిరుమ‌ల ముచ్చట్లు :

శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల‌కు నిర్విఘ్నంగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ జ‌ర‌గాల‌ని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని, శ్రీ దుర్గామాతను ప్రార్థిస్తూ విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో ఆయుధ‌పూజ నిర్వ‌హించిన‌ట్టు టిటిడి ఈవో   కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో సోమ‌వారం ఉదయం జరిగిన ఆయుధపూజలో అద‌న‌పు ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో   గోపినాధ్‌ జెట్టితో కలిసి ఈవో పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ విజ‌య‌ద‌శ‌మి రోజున ప‌నిముట్ల‌ను, ఆయుధాలను పూజించుకోవ‌డం సంప్ర‌దాయంగా వ‌స్తోంద‌న్నారు. దుర్గామాత మ‌హిషాసురమ‌ర్ధ‌నం చేసి విజ‌యం సాధించిన‌ట్టు ప్ర‌తి ఒక్క‌రూ వారి రంగాల్లో విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తూ ఆయుధ‌పూజ నిర్వ‌హిస్తారని చెప్పారు. ఈ సంద‌ర్భంగా అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి వినియోగించే సామ‌గ్రికి, యంత్రాల‌కు పూజ‌లు చేసిన‌ట్టు వివ‌రించారు.అంతకుముందు అన్నప్రసాద భవనంలో శ్రీవారి చిత్రపటానికి, వంట పాత్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిటిడి అన్నప్రసాదం డెప్యూటీ ఈవో   నాగ‌రాజ‌, డెప్యూటీ ఈవోలు   బాలాజి, శ్రీ దామోద‌రం,   సెల్వం, విజివో   మనోహర్‌, క్యాట‌రింగ్ అధికారి   సాయిబాబా ‌రెడ్డి, ఏఈవో   లోక‌నాథం ఇతర అధికారులు, అన్న‌ప్ర‌సాద విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

అక్టోబ‌రు 27న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల నవంబరు కోటా విడుదల

Tags: Ayudha Puja for the uninterrupted distribution of Annaprasada to the devotees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *