గ్రామాలకు చేరని  ఆయూష్మాన్

హైదరాబాద్ ముచ్చట్లు:


ఆరోగ్య శ్రీ, ఆయూష్మాన్ భారత్స్కీమ్లను కలిపి అమలు చేస్తే డెంగీ, మలేరియా వ్యాధులూ ఒకే పరిధిలోకి వస్తాయి. దీంతో ఆయా ప్యాకేజీల ద్వారా పేద ప్రజలు ఉచితంగా ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని కేవలం ప్రభుత్వ దవాఖాన్లకే పరిమితం చేసింది. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖాన్లకు ఇవ్వలేదు. దీనివల్ల ఆ పథకాలు ఉన్నా ఎలాంటి ఉపయోగం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుతం ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్ఆసుపత్రుల వరకు డెంగీ, మలేరియా, తదితర జ్వరాలకు ఫ్రీగానే వైద్యం ఇస్తున్నారు. ఆయూష్మాన్భారత్స్కీమ్ద్వారా ఈ రోగాలకు వైద్యం అందిస్తే చికిత్సను నిర్వహించిన డాక్టర్లకు ఇన్సెంటీవ్‌లు వస్తాయి. అంతేగాక పేషెంట్కేర్కూడా మెరుగుపడుతుంది. డాక్టర్లు కూడా బాధ్యతాయుంగా ట్రీట్మెంట్ అందిస్తారు. దీంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.రూరల్, ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ, మలేరియా విషజ్వరాలు విపరీతంగా వ్యాపిస్తుంటాయి. వర్షకాల సీజన్లో వీటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే చాలా మంది పీహెచ్‌సీలకు వెళ్లేందుకు ఆసక్తి చూపక, ప్రైవేట్ క్లినిక్‌లను ఆశ్రయిస్తుంటారు. ప్రతీ సీజన్‌లో వేల రూపాయలు ఖర్చు పెడుతూ చికిత్స పొందుతారు. ఇక డెంగీ, స్వైన్ప్లూ వ్యాధులకైతే ప్లేట్ లెట్స్ కొరత అంటూ ప్రైవేట్ డాక్టర్లు అందినకాడికి దోచుకుంటారు. అవసరం లేకపోయినా ప్లేట్లెట్స్కావాలంటూ నొక్కి చెప్తారు. చేసేదేమీ లేక చాలా మంది పేషెంట్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. అయితే ప్రైవేట్‌లో కూడా డెంగీ, మలేరియా చికిత్సకు అప్రూవల్స్ ఇస్తే ఎంతో మంది నిరుపేదలకు లాభం జరుగుతుందని స్వయంగా హెల్త్ డిపార్ట్మెంట్ లోని ఆఫీసర్లు ఆఫ్‌ ది రికార్డులో చెబుతున్నారు. కానీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు.

 

Tags; Ayushman not reaching the villages

Post Midle
Post Midle
Natyam ad