సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో ‘ఆజాది కా అమృత మహోత్సవం’

-ఆగస్టు 15న ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగరవేయాలని, జాతీయ భావాన్ని పెంపోందించాలి, -అలిపిరి పోలీస్ ఇన్స్పెక్టర్ అబ్బన్న విద్యార్తులకు ఉద్బోధ.

తిరుపతి ముచ్చట్లు:

సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో ‘ఆజాది కా అమృత మహోత్సవం’ కార్యక్రమం తిరుపతి జీవకొనలోని విశ్వం విద్యాసంస్థల ఆడిటోరియం లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమాన్ని షేక్ ముహమ్మద్ రఫీ అతిధులను వేదిక పైకి ఆహ్వానించి ప్రారంభించగా, సంకల్ప సేవా సమితి వ్యావస్తాపాక అధ్య క్షులు ఎన్. రాజారెడ్డి అధ్యక్షత వహించారు, ముఖ్య అతిధిగా అలిపిరి పోలీస్ ఇన్స్పెక్టర్ అబ్బన్న హాజరై ప్రసంగిస్తూ భారత దేశం బ్రిటిష్ కబంద హస్తాలలో నలిగి స్వేచ్చా వాయువులు పీల్చలేని సమయంలో అనేక మంది స్వతంత్ర ఉద్యమ నాయకులు పోరాటాలు చేసి జైళ్లకు వెళ్లి స్వతంత్రాన్ని సాధించడం జరిగింది. చిన్నారులైన మీరు ఇదే స్వతంత్య ఉద్యమ నాయకుల చరిత్రను తెలుసుకొని జాతీయ జెండాను ఆగస్టు పదిహేనవ తేది ప్రతి ఇంటి పైన ఎగురవేసి, జాతీయభావం పెంపోందించాలని కోరారు. సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులను చైతన్య వంతులను చేయటానికి ఇలాంటి కార్యక్రమం చేయటం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు.

 

 

 

సన్మానం గ్రహీతగా విశ్రాంత సైనికాధికారి పి. మోహన్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ పై కార్గిల్ యుద్దంలో పాల్గొన్న ప్రత్యక్ష అనుభవాలను విద్యార్థులకు వివరించారు. నేటి పరిస్థితులలో ప్రతి ఇంటికి ఒకరు సైనికుడులా తయారు కావలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. విద్యార్ధి దశ నుంచే జాతియొద్యమ భావాలను ప్రతి ఒక్కరు ఉనికిపుచ్చుకోవాలని కోరారు. అనంతరం ప్రముఖ మిమిక్రి కళాకారులు డి. విజయ్ కుమార్ మిమిక్రీ, మ్యాజిక్, మాట్లాడే బొమ్మలను ప్రదర్శిస్తూ స్వతంత్యం సంపాదించి 75 సంవత్సరాలు పూర్తైనా సందర్బంగా ఆజాదికా అమృత మహోత్సవంలో భాగంగా సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో దేశభక్తిని విద్యార్థుల్లో పెంపొందించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయటం హర్షనీయం అన్నారు. విద్యార్థులు తమతో పాటు తన చుట్టూ పక్కల వాళ్ళను కూడా చైతన్యవంతులను చేసి ఆగస్టు 15న జాతీయ జండా ప్రతి ఇంటిపైన ఆవిష్కరించేటట్లు చూడగలరు. అనంతరం రిటైర్డ్ ఆర్మీ అధికారి పి. మోహన్ రెడ్డి కి నిర్వాహకులు, అలిపిరి ఇన్స్పెక్టర్ అబ్బన్న చేతుల మీదుగా దుస్సాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో అలిపిరి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ఇమ్రాన్ బాషా, విశ్వం విద్యాసంస్థల అధినేత ఎన్. విశ్వనాథ రెడ్డి, ఆధార్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ ముహమ్మద్ రఫీ, రవీంద్రభారతి స్కూల్ అధినేత రవీంద్ర రెడ్డి, అమరావతి సైనిక్ స్కూల్ ఈశ్వర్ రెడ్డి, విశ్వం స్కూల్ హెడ్ మాష్టర్ సుబ్రహ్మణ్యం, పిఇటి హరి నాయక్, విశ్వం స్కూల్ టీచర్లు, విద్యార్థినివిద్యార్థులు పాల్గొన్నారు.

Tags:’Azadi Ka Amrita Mahotsavam’ under Sankalpa Seva Samiti

Leave A Reply

Your email address will not be published.