Natyam ad

కడపలో ఆజాదీకా మహోత్సవం

కడప ముచ్చట్లు:


కడప జిల్లా ఎస్పీ కె కె అన్బురాజన్ అద్వర్యం లో కడప  పోలీస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం  ‘హర్‌ ఘర్‌ తిరంగా’ (ఇంటింటికీ మువ్వన్నెల జెండా) కార్యక్రమం, జాతీయ జెండా రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య ….తెలుగు నాటకరంగ ప్రముఖులు బళ్లారి రాఘవల జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్  జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పింగళి వెంకయ్య, బళ్లారి రాఘవల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి  మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పింగళి వెంకయ్య తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని కొనియాడారు. భారత జాతీయోద్యమంలో పింగళి కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు. సత్యం, అహింసలను ఆచరించటం వల్ల దేశం సుభిక్షంగా ఉంటుందని విశ్వసించిన మహనీయుడని, ఆ స్ఫూర్తితోనే మహాత్మాగాంధీ సూచనలతో జాతీయపతాకానికి పింగళి రూపకల్పన చేశారన్నారు.
పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్టా జిల్లా దివి తాలూకాలోని భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. 1921 మార్చి 31వ తేదీన విజయవాడలో జరిగిన భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జెండాను రూపొందించి అందించారు. ఈ త్రివర్ణ పతాకంలో ఉండే మూడు రంగులు … కేసరి (కాషాయం) – ధైర్య సాహసాలకు, త్యాగానికి   తెలుపు – శాంతి, సత్యాలకు, ఆకుపచ్చ – ప్రగతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకలన్నారు.

 

 

తెలుగు నాటక రంగ ప్రముఖులు, ప్రముఖ న్యాయవాది, నాటకాలంటే ప్రత్యేకాభిమానం, ప్రతిభతో రాణించి తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతి కోసం వెచ్చించిన మహనీయుడు బళ్లారి రాఘవ ( తాడిపత్రి రాఘవాచార్యులు) అని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్  కొనియాడారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్  బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ బళ్లారి రాఘవకు బాల్యం నుంచే నటనలో, నాటకాల్లో ఆసక్తి ఉండేదన్నారు. కొద్దికాలంలోనే రాఘవ న్యాయవాదిగా, ముఖ్యంగా క్రిమినల్ కేసులు వాదించడంలో ప్రసిద్ధి చెందారన్నారు. హావభావ ప్రకటన లోను, డైలాగులు చెప్పడంలోనూ రాఘవ అసమానుడనిపించుకొన్నారన్నారు .ఆయన ప్రతిభను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించి ‘రావు బహద్దూర్’ అన్న బిరుదు ఇచ్చిందన్నారు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో జెండాలతో భావోద్వేగ బంధాన్ని ఏర్పరచే లక్ష్యంతో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ (ఇంటింటికీ మువ్వన్నెల జెండా) కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని పేర్కొన్నారు త్రివర్ణ పతాకాన్ని ఇంటిపై రెపరెపలాడించడం ద్వారా భారతీయులందరిలోనూ జాతీయవాద భావన మేల్కొల్పాలనేది ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమన్నారుకార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పూజిత నీలం,  ఏ.ఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్, ఏ.ఆర్ డి.యస్.పీ రమణయ్య,  ఆర్.ఐ లు మహబూబ్ బాషా, జార్జ్, సోమశేఖర్ నాయక్, ఆర్ ఎస్ ఐ లు, పోలీసు, డి.పి.ఓ సిబ్బంది పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Azadika mahotsava in Kadapa

Post Midle