Natyam ad

బి.కొత్త కోటలో దంపతులు ఆత్మహత్యాయత్నం

బి. కొత్తకోట ముచ్చట్లు:

బి.కొత్తకోటలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు కథనం మేరకు.. బి కొత్తకోట రంగసముద్రం రోడ్డులో కాపురం ఉంటున్న దంపతులు బాలాజీ(35), అశ్వినికి(27)కు పెళ్లి జరిగి 9 సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు కలగలేదు. దీంతో ఇద్దరూ బుధవారం మధ్యాహ్నం గొడవ పడ్డారు. మనస్థాపం చెందిన అశ్విని ఇంట్లో వున్న పురుగు మందు తాగడంతో గమనించిన భర్త బాలాజీ ఆ వెంటనే ఆమె దగ్గర ఉన్న పురుగు మందు డబ్బా తీసుకొని తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. కుటుంబీకులు గమనించి బాధితులను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి చికిత్స పొందుతున్నారు.

 

Post Midle

Tags; B. A couple attempted suicide in Kotta Kota

Post Midle