Natyam ad

తుమ్మల పల్లి కళాక్షేత్రం నందున బి.సిల ఆత్మ గౌరవం సభ

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ నగరం నడిబొడ్డున తుమ్మల పల్లి కళాక్షేత్రం నందున బి.సిల ఆత్మ గౌరవం సభ నిర్వవహించబడినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ,ప్రభుత్వ గౌరవ సలహాదారులు   సజ్జల రామకృష్ణ రెడ్డి ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు జోగి రమేష్ , మతి విడుదల రజిని , ముత్యాల నాయుడు  , కారుమురి నాగేశ్వరరావు,  ఉష శ్రీ చరణ్ ,  సిదిరి అప్పలరాజు ,  చాలబోయన వేణు గోపాల కృష్ణ ,కృష్ణ జిల్లా చైర్ పర్సన్  హారిక ,విజయవాడ మేయర్  అనురాధ  ,APMDC ఛైర్మన్  షమిమ్ అస్లాం ,ప్రముఖ విద్యాసంస్థల అధిపతి  తట్టి అర్జున్ రావు  , మారిష్  మొదలగు బి.సి పెద్దలు హాజరయ్యారు..ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులను ,బి.సి కులాల పెద్దలను ఘనంగా సత్కరించటం జరిగినది.

 

Post Midle

గత 75 సంవత్సరాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు బి.సిలను వాడుకుంటున్నాయి కానీ చట్టసభలలో బి.సిలకు ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ మొదటి సారి యావత్ భారత దేశంలోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యెస్ జగన్ మోహన్ రెడ్డి  మంత్రివర్గంలోను,వివిధ పదవులలోను బి.సిలకు పెద్ద పీట వేశారు .దీనికి బి.సి కులాలు ఎల్లప్పుడూ రుణపడివుంటాం.అలానే బి.సీ కులాలకు ఒకలక్ష ఎనభై వేలు కోట్లు కేటాయించి బి.సి అభివృద్ధికి చేయుతనిచ్చారు దీనికి ముఖ్యమంత్రి కు కృతజ్ఞతలు.రాబోవు మార్చ్ తదుపరి జరిగే 17 MLC పదవులకు బి.సి కులాల వారికి కేటాయించాలని కోరగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు  సజ్జల రామకృష రెడ్డి  ప్రసంగిస్తూ బి.సి కుల పట్ల  వై.యెస్ జగన్మోహన్ రెడ్డి కి ఉన్న ప్రేమను వివరించి ఇంకా బి.సి కులాల అభ్యునితికి ఎటువంటి కార్యక్రమాలు మరియు పథకాలు ప్రవేశ పెట్టాలో బి.సి కులాల ప్రజలనుంచి సలహాలు స్వీకరించి ముఖ్యమంత్రి   తెలియచేస్తామన్నారు.అలానే 17 MLC పదవులలో బి.సి కులాలకు పెద్ద పీట వేస్తామని తెలియ పరిచారు..

Tags: B.C.’s self-esteem meeting for Tummala Palli Kalakshetra

Post Midle

Leave A Reply

Your email address will not be published.