బి.కొత్తకోటలో కరెంట్ షాక్ కొట్టి మెకానిక్ మృతి

బి. కొత్తకోట ముచ్చట్లు:

కరెంట్ షాక్ కొట్టి మెకానిక్ మృతి చెందిన సంఘటన విషాదకర ఘటన బి.కొత్తకోట మండలంలో జరిగింది. ప్రమాదంపై పోలీసుల కథనం.. పిటిఎం మండలం, కాయలవాండ్లపల్లెకు చెందిన డిష్ మెకానిక్ రామకృష్ణ (45) ఆదివారం బి. కొత్తకోట మండలం, ఓబిరెడ్డిగారిపల్లె దగ్గర డిష్ రిపేరు చేయడానికి వచ్చాడు. డిష్ వైర్లు రిపేరు చేస్తుండగా, కరెంట్ షాక్ కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించడానికి పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

Tags: B. Mechanic died due to electric shock in Kottakota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *