బిసి చైతన్య సదస్సుకు బయలుదేరిన ఉద్యోగులు

B.Sc. Employees Federation Chaitanya Meeting

B.Sc. Employees Federation Chaitanya Meeting

Date:07/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణ బిసి ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలో జరిగిన బిసి చైతన్య సదస్సుకు వెళ్లారు. సంఘ నాయకులు ఉమాపతి యాదవ్‌, లింగమూర్తి యాదవ్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు వెళ్లారు. ఈ సందర్భంగా ఉమాపతి యాదవ్‌ మాట్లాడుతూ బిసి ఉద్యోగులు వెనుకబడిన తరగతులు రాజ్యాధికారం సాధించడానికి ఐకమత్యంతో పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువతను విద్యాపరంగా అభివృద్ధి చేసి, ఉన్నతస్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటు అనే ఆయుధంతో రాజ్యాధికారాన్ని బిసిలు సులభంగా కైవసం చేసుకునేందుకు వీలుందన్నారు. ఐకమత్యమే బిసిల బలమని నిరూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్‌రెడ్డి యాదవ్‌, వెంకట్రమణప్ప, నారాయణ, రామక్రిష్ణ, మోహన్‌, రెడ్డెప్ప, క్రిష్ణమూర్తి, మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

బీసీ ఎంప్లాయిస్ పెడరెషన్ చైతన్య సమావేశానికి బయలుదేరిన పుంగనూరు ఉద్యోగుల బృందం.

ఏపీకి భారీ వర్ష సూచన

Tags:B.Sc. Employees Federation Chaitanya Meeting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *