Baba Ramdev slips while doing yoga on an elephant.

ఏనుగు మీద యోగా చేస్తూ జారిపడ్డ బాబా రాం‌దేవ్.

Date:14/10/2020

ఉత్తరప్రదేశ్‌ ముచ్చట్లు:

మథుర: ప్రముఖ యోగా గురు బాబా రాం‌దేవ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఏనుగు మీదకు ఎక్కి యోగా చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఆయన కిందపడ్డారు.ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న ఓ ఆశ్రమానికి వెళ్లిన ఆయన అక్కడున్న వారికి యోగాసనాలు వేసి చూపించే ప్రయత్నం చేశారు. ఏనుగుపై ఎక్కి కూర్చుని పద్మాసనం వేసిన ఆయన భ్రమరీ ప్రాణాయామం చేస్తుండగా ఏనుగు ఉన్నట్టుండి కదిలింది.దీంతో.. ఏనుగుపై కూర్చున్న ఆయన అదుపు తప్పి కిందపడ్డారు.అయితే.. కింద పడిన రాందేవ్ బాబాకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.

శిరమెత్తి .. బ్రతికేటి.. నా చిత్తూరు!!!

Tags: Baba Ramdev slips while doing yoga on an elephant.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *