బాబా వంగా జోస్యాలు వెలుగులోకి

బల్గేరియా ముచ్చట్లు:

 

బల్గేరియాకు చెందిన అంధ ఆధ్యాత్మికవేత్త, ప్రపంచ ప్రఖ్యాత కాలజ్ఞానిగా పేరుగాంచిన బాబా వంగా (అసలు పేరు వాంజెలియా పాండేవా గుష్టెరోవా) చెప్పిన మరికొన్ని జోస్యాలు వెలుగులోకి వచ్చాయి.
రానున్న దశాబ్దాల్లో ఏం జరగబోతోందో ఆమె చెప్పారు.

రాబోయే దశాబ్దాల్లో బాబా వంగా కాలజ్ఞానం..

2025 – యూరప్‌లో ఒక పెద్ద వివాదం ఏర్పడుతుంది. ఈ వివాదం కారణంగా ఖండంలో జనాభా గణనీయంగా తగ్గిపోతుంది.

2028 – నూతన ఇంధన వనరులను అన్వేషించే ప్రయత్నంలో మనుషులు శుక్ర గ్రహాన్ని చేరుకుంటారు.

2033 – ధ్రువం మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతాయి.

2076 – కమ్యూనిజం తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఉద్భవిస్తుంది.

2130 – భూగ్రహానికి వెలుపలి నాగరికతలతో (గ్రహాంతరవాసులు) సంబంధం ఏర్పడుతుంది.

2170 – ప్రపంచవ్యాప్తంగా కరువు ఏర్పడుతుంది.

3005 – కుజ గ్రహంపై ఒక యుద్ధం జరుగుతుంది

3797 – భూమిని నాశనం అవుతుంది. అయితే సౌర వ్యవస్థలోని మరొక గ్రహానికి వెళ్లగలిగే సామర్థ్యం మనుషులకు ఉంటుంది.

5079 – ప్రపంచం అంతం అయిపోతుంది.

కాగా 85 సంవత్సరాల వయస్సులో 1996లో బాబా వంగా చనిపోయారు. పన్నెండేళ్ల వయసులోనే ఆమె తన చూపుని కోల్పోయారు. ‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’ అని కూడా ఆమెను పిలుస్తుంటారు. మన తెలుగువారు ‘బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని’ ఏవిధంగా నమ్ముతారో.. బల్గేరియాలో బాబా వంగా చెప్పే జోస్యాలను అలాగే విశ్వసిస్తున్నారు. కొన్ని ఘటనల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆమె జోస్యాలను విశ్వసించడం మొదలైంది. చాలా అంచనాలు నిజమవడం ఇందుకు కారణమైంది. అందుకే ఆమె కాలజ్ఞానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అమెరికాను గజగజలాడించిన 9/11 ఉగ్రవాద దాడులు, బ్రిటన్ యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు, బ్రెగ్జిట్ వంటి కొన్ని సంఘటనల్ని ఆమె ముందే ఊహించి చెప్పారనే అంటుంటారు.2024లోనూ ఆమె అంచనా వేసిన కొన్ని నిజమవుతున్నాయనే వాదనలు ఉన్నాయి. క్యాన్సర్ వ్యాక్సిన్‌ని రష్యా అభివృద్ధి చేయడం, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి శక్తిమంతమైన దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం ఆమె చెప్పి జోస్యాల్లో భాగమేననే వాదనలు ఉన్నాయి.బాబా వంగా అనుచరులు ఇప్పటికీ ఈ ప్రవచనాల గురించి ఆకర్షితులయ్యారు మరియు ఊహాగానాలు చేస్తున్నారు, ఇది చాలా కాలం పాటు విస్తరించింది.

 

 

Tags:Baba Vanga’s prophecies come to light

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *