అన్న కూతురిని నరికిన బాబాయ్
పల్నాడు ముచ్చట్లు:
పల్నాడు జిల్లా దారుణ సంఘటన జరిగింది. సత్తెనపల్లి మండలం వెన్నేదేవి గ్రామంలో కూతురిపై బాబాయ్ కత్తితో దాడి చేశాడు. ఆస్తి గోడవల కారణంగా రోడ్డుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన కోటమ్మ పరిస్థితి విషమం ఉంది. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. 30 సెంట్ల స్థలం కోసం వివాదంమొదలైనట్లు తెలుస్తోంది. బాధితురాలు కోటమ్మ ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గ్రామస్థుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు ననమోదు చేసి విచారణ చేస్తు్న్నారు.
Tags: Baba who cut off Anna’s daughter

