బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కు ఘననివాళులు

Babasaheb Ambedkar is a great guy

Babasaheb Ambedkar is a great guy

Date:06/12/2018

పుంగనూరు ముచ్చట్లు:

భారతరాజ్యాంగ కమిటి చైర్మన్‌ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి వైఎస్సాఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్ప , ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, జెడ్పిప్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపిపి నరసింహులు, ఎంఆర్‌పిఎస్‌ కార్యదర్శి మిద్దింటి వెంకటస్వామి, విశ్రాంత ఉద్యోగులు మునస్వామి, శ్రీరాములు పూలమలలు వేసి నివాళులర్పించారు. అలాగే మాలమహానాడు అధ్యక్షుడు ఎన్‌ఆర్‌.అశోక్‌ ఆధ్వర్యంలో యువకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు శంకరప్ప , న్యాయవాది శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆ కమిటి సభ్యులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అలాగే పోలీస్‌ స్టేషన్‌లో సీఐ నాగశేఖర్‌, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్‌ అమర్‌రహే …అంబేద్కర్‌ ఆశయాలు సాధిస్తాం…అంటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌.అశోక్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ జయంతికి , వర్ధంతికి సెలవు మంజూరు చేయకపోవడం కులవివక్షతే అని ఆరోపించారు. అంబేద్కర్‌ జయంతికి, వర్ధంతికి సెలవు ప్రకటించాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు మోహన్‌, కేశవ, పూలరమేష్‌, గంగాధర్‌, చలపతి, శ్రీనివాసులు, రెడ్డెప్ప, గోవర్ధన, గంగరాజు, మునిరాజ, గంగాధరం, శేఖర్‌, బాబు, మోహన్‌చంద్ర, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీకి ముస్లింల నియామకం

Tags; Babasaheb Ambedkar is a great guy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *