Natyam ad

ఈనెల 26న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

పోస్టర్ విడుదల చేసిన కో ఆప్షన్ సభ్యుడు

ఆసిఫాబాద్ ముచ్చట్లు:


ఈనెల 26న భారత్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని కో ఆప్షన్ సభ్యుడు షేక్ సలీం అన్నారు. మంగళవారం లింగాపూర్ మండల కేంద్రంలోని ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టులను విడుదల చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మండలంలోని విగ్రహం ఏర్పాటు చేసి ఆవిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మండలంలో పంచదాతులతో 10 లక్షల రూపాయలతో నిర్మించే  విగ్రహం కార్యక్రమానికి ప్రతి మండలాల నుండి జిల్లాల నుండి భారీ సంఖ్యలో హాజరై బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని  ఆవిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  మెస్రం గంగు పటేల్ ,గౌతమ్ ,విద్యాసాగర్, ప్రకాష్ మనోజ్, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Babasaheb Ambedkar statue unveiled on 26th of this month

Post Midle

Leave A Reply

Your email address will not be published.