బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కు ఘననివాళులు

Babasaheb Ambedkar was a great man

Babasaheb Ambedkar was a great man

Date:06/12/2019

పుంగనూరు ముచ్చట్లు:

భారతరాజ్యాంగ కమిటి చైర్మన్‌ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వర్ధంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ఆర్‌.అశోక్‌ ఆధ్వర్యంలో ఎంఆర్‌పిఎస్‌ కార్యదర్శి మిద్దింటి వెంకటస్వామి, ఏపి రాష్ట్ర దళిత సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు శంకరప్ప పూలమలలు వేసి నివాళులర్పించారు. అలాగే పోలీస్‌ స్టేషన్‌లో సీఐ మదుసూదనరెడ్డి, ఎస్‌ఐ తిప్పేస్వామి ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్‌ అమర్‌రహే …అంబేద్కర్‌ ఆశయాలు సాధిస్తాం…అంటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌.అశోక్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ జయంతికి , వర్ధంతికి సెలవు మంజూరు చేయకపోవడం కులవివక్షతే అని ఆరోపించారు. అంబేద్కర్‌ జయంతికి, వర్ధంతికి సెలవు ప్రకటించాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు ఎన్‌.శ్రీనివాసులు, ఎం.రెడ్డెప్ప, డి.మంజునాథ్‌, జివి.రెడ్డెప్ప, రామయ్య, రఘు, ఎన్‌.శ్రీనివాసులు, పి.కేశవ, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి వెంకట్రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన కలిగివుండాలి

Tags: Babasaheb Ambedkar was a great man

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *