బాబ్రీమసీదును నిర్మించాలి

Babri Masjid should be built

Babri Masjid should be built

Date:06/12/2018

పుంగనూరు ముచ్చట్లు:

బాబ్రీ మసీదును పున ర్మించాలని సోషియల్‌ డెమెక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు చాంద్‌బాషా డిమాండు చేశారు. గురువారం ఈ మేరకు తహశీల్ధార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్ధార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. చాంద్‌బాషా మాట్లాడుతూ 1992 డిసెంబర్‌ 6 న బాబ్రీమసీదును కూల్చివేశారని, అదే స్థానంలో తిరిగి బాబ్రీమసీదును నిర్మించాలని డిమాండు చేశారు. భారతదేశంలో మతసామరస్యాన్ని కాపాడాలని డిమాండు చేశారు. మతాల పేరిట రాజకీయ లబ్ధికోసం కొన్ని పార్టీలు కుట్రలు పన్నుతోందని, దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు జమీర్‌లాల్‌, అతిక్‌బాషా, అల్లాబకష్‌, జాకీర్‌హుసేన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కు ఘననివాళులు

Tags: Babri Masjid should be built

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *