ఓటమికి బాబు సాకులు చెబుతున్నారు

Babu excuses for defeat

Babu excuses for defeat

Date:31/12/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే ఆ రాష్ట్రం లో ఫలితాలు ఎలా ఉంటాయో తెలిసి పోతోంది. ఓటమి కి బాబు ఇప్పట్నుంచే సాకులు చెబుతున్నట్టు ఉన్నారు. కెసిఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పకుండా ఏవేవో మాట్లాడుతున్నారని తెరాస ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, బాల్క సుమన్ అన్నారు. సోమవారం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. బాబు ను ఎదుర్కొనేందుకు ముగ్గురు మోడీ లు అవసరం లేదు. ఏపీ ప్రజలు చాలు. మోడీ తో ,బీజేపీ తో తెరాస  కు ఎపుడూ రాజకీయ సంబంధాలు లేవని వారన్నారు. కేవలం రాజ్యాంగ బద్దమైన సంబంధమే కేంద్రం తో ఉంది. చంద్రబాబు పూటకో విధానం తో ముందుకు పోతున్నారు. హై కోర్టు పై అఫిడవిట్ గురించి చంద్రబాబు ను మాట్లాడమని కెసిఆర్ అడిగితే వేరేది మాట్లాడుతున్నారు.
ఎన్టీఆర్ ను దించేందుకు కెసిఆర్ సూత్రధారి అయితే కెసిఆర్ యే అపుడు సీఎం అయ్యేవారు కదా అని అన్నారు. చంద్రబాబు తన అబద్దాలతో ఏపీ ప్రజలను వంచిస్తున్నారు. కెసిఆర్ తెలంగాణ కోసం గొంగళి పురుగు నైనా ముద్దు పెట్టుకుంటానన్నారు. 2004 లో కాంగ్రెస్ తో 2009 లో టీడీపీ తో తెరాస పొత్తు పెట్టుకున్నది తెలంగాణ కోసమే. తెలంగాణ కోసం అన్ని పార్టీ లను ఒప్పించిన ఘనత కెసిఆర్ దే. చివరకు చంద్రబాబు ను తెలంగాణ కోసం ఒప్పించే కెసిఆర్ టీడీపీ తో పొత్తు పెట్టుకున్నారు. 2004 లో చంద్రబాబు ను బండకేసి కొట్టింది కాంగ్రెస్ ,తెరాస పొత్తే. 2009 లో తెరాస తో పొత్తుకు ముందుకు వచ్చింది టీడీపీ యే అని అన్నారు. చంద్రబాబు టీడీపీ సహా 36 పార్టీ ల లను తెలంగాణ కోసం ఒప్పించిన ఘనత కెసిఆర్ ది. .చంద్రబాబే కెసిఆర్ దారిలోకి వచ్చారు.
కెసిఆర్ బాబు దారిలోకి రాలేదు. కెసిఆర్ తన ప్రెస్ మీట్ లో బాబు తో పాటు మోడీ ని ఎండగట్టారు. మొన్నటి ఎన్నికల్లో మోడీ కెసిఆర్ దోస్తీ అంటూ బాబు ఎంత చెప్పినా ప్రజలు తెరాస ను ఆదరించారు. రేపు ఏపీ లో కూడా అదే జరుగుతుంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం చంద్రబాబు లాగా కెసిఆర్ అబద్దాలు చెప్పలేదు. గోబెల్సే ఆశ్చర్యపడే రీతి లో బాబు అబద్దాలు ఆడుతున్నారు. గోబెల్స్ సిద్దాంతాలను తెలంగాణ తిరస్కరించింది. ఏపీ కూడా తిరస్కరిస్తుందని వారన్నారు. రాష్ట్రాలు విడి పోయినా హై కోర్టు ఎందుకు కలిసి ఉండాలన్న కారణం బాబు చెప్పలేక పోయారు. నాలుగున్నరేళ్లలో హై కోర్టు భవనం కూడా బాబు కట్టలేక పోయారు.
కెసిఆర్ తో చంద్రబాబు అభివృద్ధిలో పోటీ పడలేరు. ఎవరిని అడిగినా తెలంగాణ అభివృద్ధి గురించి చెబుతారు. మోడీ , జగన్ లతో ఎలా వ్యవహరించాలో కెసిఆర్ కు తెలుసు. పక్క రాష్ట్రాలతో సంబంధాల విషయం లో కెసిఆర్ రాజకీయ పరిణతి తో వ్యవహరించారని అన్నారు. మహారాష్ట్ర తో సాగునీటి ఒప్పందం ఒక్కటి చాలు కెసిఆర్ రాజకీయ పరిణతి తెలుసుకోవడానికి చంద్రబాబు కెసిఆర్ తో పాలన లో పోటీ పడాలి. ఇకనైనా చంద్రబాబు అబద్దాలు ఆపాలి. కెసిఆర్ బూచి చూయించి ఏపీ లో ఓట్లు పొందాలనుకుంటే అది బాబు తెలివి తక్కువ తనమే అవుతుందని విమర్శించారు.
Tags:Babu excuses for defeat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed