కుప్పంలో బాబుకు ఓటమి భయం
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది అందుకే కుట్రలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పుంగనూరు ఘటనపై స్పందించారు.. హంద్రీ నీవా నుంచి కుప్పానికి రెండు నెలలలో మంచి నీళ్ళు ఇస్తున్నాం.. దీన్ని తట్టుకోలేక కడుపు మంటతో చంద్రబాబు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కుప్పంలో స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కనుమరుగు అవుతుందనే భయంతో ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కు పిచ్చితో మదమెక్కి ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టిన ఆయన.. వైఎస్ జగన్ ప్రజలను, దేవుణ్ణి నమ్ముకున్నారు.. కానీ, చంద్రబాబు నాయుడు కుట్రలు నమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.టీడీపీ వారికి సైతం పథకాలు ఇవ్వమని చెప్పిన నాయకుడు వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు.

ఎంపీ రెడ్డెప్ప.. సీఎం జగన్ గొప్ప మనసు వల్లే చంద్రబాబుకు మనుగడ సాధ్యమవుతుందన్న ఆయన.. వైఎస్ జగన్ పాలన వల్లే మా రాయలసీమలో వలసలు ఆగాయన్నారు. రాయలసీమలో సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి పరుగులు పెట్టించారు.. వచ్చే ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు ఓటమికి ఖాయం అని జోస్యం చెప్పారు. పట్ట పగలే పోలీసులే పై దాడులు చేయించారు.. హత్యా రాజకీయాల చరిత్ర చంద్రబాబుదే అని విమర్శించారు. వంగవీటి రంగాను చంపించిన చరిత్ర చంద్రబాబుదే అంటూ ఫైర్ అయ్యారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రెడ్డెప్ప.
Tags: Babu is afraid of defeat in the heap
