బాబు నిర్వాకంతోనే నిధులు రాలేదు

Date:20/07/2019

విజయవాడ ముచ్చట్లు:

రాజధాని పేరుతో చంద్రబాబు అంతర్జాతీయస్కామ్ కు పాల్పడ్డారు. బాహుబలి గ్రాఫిక్స్ సెట్టింగ్స్ తప్ప ఎల్లో మీడియా ప్రచారార్భాటాలు తప్ప కనీసం రాజధానికి రహదారులు కూడా నిర్మించలేదని పెడన ఎంఎల్ ఏ  జోగి రమేష్ ఆరోపించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. రాజధానిలో చంద్రబాబు సర్కార్ అడగడునా ఉల్లంఘనలు చేసారు. చంద్రబాబూ రాజధాని రైతులు మీతో కలసి వచ్చారా? అమరావతిని ఓ భ్రమరావతిగా చూపించారు. మీరు ఇంత దారుణంగా రాజధాని డిజైన్స్ ఇచ్చారు.

 

 

 

 

 

 

మంత్రులను,అధికారులను పంపించి రైతులను భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు. మకీ సంస్ధ మీ అసమర్ధతను అవినీతిని ఎండగడుతూ బహిరంగ లేఖ రాసింది. ప్రపంచబ్యాంక్ రుణం వెనకకు వెళ్లడమేంటి.ఆ బ్యాంక్ ఎప్పుడు రుణం ఇస్తానని చెప్పింది. ప్రపంచబ్యాంక్ ద్వారా జూన్ 12 న ఓ లేఖ వచ్చింది. రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నారు.సామాజిక న్యాయం పాటించలేదు. వ్యవసాయ భూమిని ప్రభుత్వం రైతుల వద్దనుంచి లాక్కుంది అని ఆ లేఖలో ఉందని అయన అన్నారు.

 

 

 

 

 

ఆ నాటికిశ్రీ వైయస్ జగన్ అధికారం చేపట్టి 12 రోజులైంది. చంద్రబాబు నిర్వాహకం వల్లనే ప్రపంచబ్యాంక్ రుణం రాలేదు. చంద్రబాబూ మీ అసమర్ధత వల్లనే ఇలా జరిగింది. ఏపిలో చంద్రబాబుదే తుగ్లక్ పాలన.లోకేష్ ట్వీట్లు చేసేముందు ఈ విషయం తెలుసుకుంటే మంచిది. చంద్రబాబు రాజధానిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోయారు. ముఖ్యమంత్రి  వైయస్ జగన్ రాజధాని నడిబొడ్డున గృహం నిర్మించుకున్నారు.

 

 

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో ఎంత దోచుకున్నారో అంతా బయటకు తీయిస్తాం. చంద్రబాబు టిడిపి నేతలు రాజధాని నిర్మాణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులకు మీరు ఏమాత్రం న్యాయం చేశారు?  రాజధాని  ప్రాంతంలో భూములు కేటాయింపుల దగ్గర్నుంచి అన్నింటా ఉల్లంఘనలే? మేం అధికారంలోకి వచ్చి 50 రోజులే అయినా ప్రజల మనస్సులు చూరగొన్నామని అన్నారు.

ఆసరా తో ఆత్మవిశ్వాసం పెంచాం…ఆత్మీయ బందాన్ని పంచాం 

Tags: Babu Nirvak has not received funds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *