కౌంటింగ్ పై బాబు పక్కా ప్లాన్

Babu pucca plan on counting

Babu pucca plan on counting

Date:15/05/2019
విజయవాడ ముచ్చట్లు:
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏది చేసినా తాను అనుకున్నది పక్కాగా చేస్తారు. సాంకేతికంగా, న్యాయపరంగా అన్ని చూసుకుని మరీ చంద్రబాబు అడుగులు వేస్తారు. పక్కా ప్రణాళిక చంద్రబాబు సొంతమంటారు. పార్టీ కార్యక్రమాల దగ్గర నుంచి ప్రభుత్వ కార్యక్రమాల వరకూ చంద్రబాబు పకడ్బందీగా నిర్వహిస్తారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇది మరింత పకడ్బందీగా తయారయింది.  ఈ నెల 23వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఈవీఎంల పై తొలి నుంచి చంద్రబాబునాయుడు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలలో లోపాలు ఉన్నాయంటున్నారు. ఎన్నికల సంఘానిపై పోరాటానికిదిగారు. జాతీయ స్థాయిలో ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ ముద్దని ఉద్యమంనిర్వహించారు. ఎన్నికలు
జరిగిపోవడంతో నియోజకవర్గంలో యాభై శాతం వీవీప్యాట్ లను లెక్కించాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈసారి ఎన్నికల ప్రారంభం నుంచి చంద్రబాబునాయుడు ఈవీఎంలను అనుమానిస్తూనే వస్తున్నారు.అందుకోసం కౌంటింగ్ లపై తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబునాయుడు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రాల్లో నేటి నుంచి కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ శిక్షణ ఇవ్వనుంది. ఏజెంట్లకు ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసేందుకు ఈ శిక్షణ కార్యక్రమంలో ఐటీ నిపుణులు కూడా పాల్గొంటున్నారు. 23వ తేదీ ఉదయం ఈవీఎంలను టేబుల్ మీద తీసుకొచ్చిన దగ్గర నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ శిక్షణ కార్యక్రమంలో నిపుణులు సూచిస్తారు. నాలుగు రోజుల పాటు ఈ శిక్షణ జరగనుంది.
ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ శిక్షణ కార్యక్రమం ఉంటుంది.ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఐదుగురు కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇప్పటికే ఇచ్చింది. వీరిలో ఒక న్యాయవాది, పార్టీ నేత, సాంకేతిక నిపుణుడు ఉంటారు. ఏజెంట్లుగా ఉండటానికి ఎవరు అర్హులు…? ఈవీఎం మిషన్ మీద ఉన్న నెంబరు, 17 సి పార్ట్ 1 లో నెంబరు ఒకటేనా? అన్నది ఏజెంట్ ముందుగా చెక్ చేసుకోవాలి. ఈవీఎంలకు సీలు వేసి ఉందా? లేదా? అన్నది చూసుకోవాలి. ఈవీఎంలలో పోలైన ఓట్లు, వీవీప్యాట్ లో ఉన్నఓట్లు సమానంగా ఉన్నాయా? లేదా? అన్నదీ చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 200 మందికి శిక్షణ ఇచ్చిన టీడీపీ వీరితో పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రాల్లో కౌంటింగ్ ఏజెంట్లకు నేటి నుంచి శిక్షణ ఇవ్వనుంది.
Tags: Babu pucca plan on counting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *