బాబుకు జాతీయ పార్టీల మద్దతు

Date:16/03/2018
కోల్ కత్తా ముచ్చట్లు:
ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం పొలిట్‌బ్యూరో సభ్యులతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఏకగ్రీవంగా చంద్రబాబు తీర్మానించారు. బీజేపీతో తెగదెంపులు చెసుకున్నట్టు టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని తృణ‌మూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మరోసారి వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించారు. ‘ఎన్డీయే నుంచి వైదొలగాలని తెదేపా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం విపత్తు నుంచి దేశాన్ని కాపాడటానికి ఈ చర్యలు దోహదపడతాయి’అంటూ మమతా బెనర్టీ ట్వీట్ చేశారు.ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడాని ప్రతిపక్షంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకమవ్వాలని అభ్యర్థిస్తున్నానంటూ ’ అని దీదీ ట్విట్ ద్వారా పిలుపునిచ్చారు.ఎన్డీయే నుంచి వైదొలగాలని టీడీపీ పొలిట్‌బ్యూర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాయనుంది. ఎన్డీఏ నుంచి ఎందుకు విడిపోతున్నామో వివరాలను ఆ లేఖలో స్పష్టం చేయనున్నారు. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై టీడీపీ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులకు విపక్షాలు సైతం మద్దతు ప్రకటించాయి.
Tags: Babu supports national parties

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *