బాబు…కేసీఆర్ ఫార్ములా అవలంబిస్తారా…

Babu ... the KCR formula will be adopted ...

Babu ... the KCR formula will be adopted ...

Date:14/09/2018
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పోలవరం, అమరావతిపైనే ఆశలు పెట్టుకున్నారు. పోలవరం పనులు వేగవంతం చేస్తున్నారు. అమరావతి రూపురేఖలు కూడా నాలుగు నెలల్లో కన్పించేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ రెండింటితోనే ఆయన ఎన్నికలకు వెళ్లదలచుకున్నారు. తన సమర్థత, పరిపాలన దక్షతపై నమ్మకముంచి మరోసారి అవకాశమివ్వాలని అభ్యర్థించనున్నారు. ఇది ఒక వైపు పరిస్థితి. మరో వైపు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ పార్ములా పనికి రాదని ఆయన సీనియర్ నేతలో సీరియస్ గానే చెప్పినట్లు తెలుస్తోంది.పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు సిట్టింగ్ లందరికీ సీట్లు ఇచ్చారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూడా ఆయన బీఫాం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏకాఎకిన 105 అసెంబ్లీ నియోజకవర్గాలకు చంద్రశేఖర్ రావు ప్రభుత్వం రద్దయిన ఒక రోజులోనే ప్రకటించి సంచలనం సృష్టించారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న చంద్రబాబు సిట్టింగ్ లు అందరికీ ఇక్కడ సీట్లు మళ్లీ దక్కే అవకాశం లేదని చెప్పారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో వారికి మళ్లీ టిక్కెట్ ఇస్తే అధికారంలోకి రాలేమన్నది చంద్రబాబుకు ఖచ్చితంగా తెలియబట్టే ఆయన ఈ వ్యాఖ్యలను చేశారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా నివేదికలను తెప్పించుకుంటున్న చంద్రబాబు దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి బాగా లేదన్న అంచనాకు వచ్చారు. పలు సమావేశాల్లో తాను హెచ్చరించినా ఈ ఎమ్మెల్యేలు పట్టించుకోక పోవడంతో వారిని ఈసారి పక్కనపెట్టి కొత్త వారిని ఎంపిక చేయాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.సిట్టింగ్ ల స్థానాలను మార్చే అవకాశముందని చెబుతున్నారు.
వీరిలో కొంత మంది ఆర్థికంగా బలంగా ఉండటం, సామాజిక వర్గాల నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలను వేరే నియోజకవర్గాలకు షిప్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారు.ప్రకాశం జిల్లాలోని ఒక ఎమ్మెల్యే ఆయనప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత నియోజకవర్గంలో పరిస్థితి బాగాలేకపోవడంతో ఆయన ఆ జిల్లాలోని మరొక నియోజకవర్గానికి మార్చనున్నట్లు తెలుస్తోంది.
అలాగే నెల్లూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలకు ప్రస్తుతమున్న నియోజకవర్గాలు దక్కకున్నా వేరే నియోజకవర్గానికి అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటిస్తారని, అయితే ఈరకంగా షిఫ్ట్ అయ్యే ఎమ్మెల్యేలు కేవలం పది మంది వరకూ మాత్రమే ఉంటారన్నది .
పార్టీవర్గాలు చెబుతున్న మాట. మిగిలిన వారికి టిక్కట్లు దక్కే అవకాశమే లేదని చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
Tags; Babu … the KCR formula will be adopted …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *