Babudhish is a mockery of democracy

ప్రజస్వామ్యాన్ని అపహ్యం చేసిన బాబుదిష్టిబొమ్మ దగ్ధం

Date:23/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

తెలుగుదేశం శాసన మండలిలో చేపట్టిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ నేతలు చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అక్కిసాని భాస్కర్‌రెడ్డి, నాగరాజారెడ్డి, మాజీ జె డ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్‌, మున్సిపల్‌ ఉద్యోగకార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్దీన్‌షరీఫ్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర ఆధ్వర్యంలో చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి, వ్యతిరేక నినాదాలతో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అనవసరంగా అడ్డుతగలడం, బీసీ కులానికి చెందిన స్ఫీకర్‌ తమ్మినేని సీతారాం పై దాడులు చేయిస్తున్నారని నినాదాలు చేశారు. ఈ విషయాలపై చంద్రబాబునాయుడు , తన అనుచరులు పద్దతులు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దొంతి వెంకటేష్‌, హేమచంద్ర, రమణ, రీయాజ్‌, నారాయణరెడ్డి, బాబు, కరీముల్లా, రెడ్డెప్ప, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

కాపు సంఘ నాయకుడు వెంకటరత్నం మృతి

Tags: Babudhish is a mockery of democracy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *