బాబు పోరాటం దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలని చైతన్యపరచింది

Date:15/04/2019

విజయవాడ ముచ్చట్లు :
దేశ రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలని చైతన్యపరచింది. ఎన్నికల నిర్వహణ తీరు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మైలవరం నియోజకవర్గం కొటికలపూడిలో మర్నాడు ఉదయం 5 గంటల వరకు పోలింగ్ జరిగిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. తెలుగుదేశం ఓటుబ్యాంకు ఎక్కువగా వున్న చోట్ల ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందులకు గురిచేశారు. వీవీ ఫ్యాట్ ల మీద అభ్యంతరాలపై టీడీపీ వాదన వినేందుకు ఈసీ మీనమేషాలు లెక్కించడం దారుణం. టీడీపీ ప్రతినిధి హరిప్రసాద్ ను చర్చకు రావద్దని ఈసీ లేఖ రాయడం సందేహాలకు తావిస్తోందని అన్నారు. చంద్రబాబునాయుడు పిలుపునందుకుకుని టీడీపీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మహిళలు పెద్దఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. వైసీపీ, బీజేపీ, టీఆరెస్ ఉమ్మడి కుట్రలపై ఆగ్రహించిన రాష్ట్ర ప్రజానీకం టీడీపీకి అండగా నిలిచింది. ముఖ్యమంత్రి పదవి వ్యామోహం తప్ప జగన్ కు రాష్ట్ర ప్రయోజనాలపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. సీఎం నేమ్ ప్లేట్ తయారుచేయించుకుని పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ముఖ్యమంత్రి అయిపోయినట్లుగా భ్రమల్లో బ్రతుకుతున్నాడు.
కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు 300 కోట్లు ఖర్చు చేసి పీకే టీమ్ కోసం ఖర్చు చేశారు. ఎన్నికల సందర్భంగా మునుపెన్నడూ లేనివిధంగా అరాచకాలు సృష్టించారు. ప్రశాంత్ కిషోర్ మార్గదర్శకత్వంలో బీహార్ తరహా అరాచకాలను ఏపీలో సృష్టించాలని కుట్రలు పన్నారు. లోటస్ పాండ్ కేంద్రంగా కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు జగన్ పనిచేస్తున్నాడు. తెలుగువాళ్లు ఎక్కడున్నా తెలుగుజాతి ప్రయోజనాల కోసం తిరగబడాలి. దేశంలో బీజేపీయేతర పార్టీలు లేకుండా చేయాలని నియంతృత్వధోరణితో మోడీ కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు.. పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులివ్వలేదు.. అమరావతికి నిధుల విడుదల లేదు.. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకే అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కేంద్రం కుట్రలకు జగన్, కేసీఆర్ తోడయ్యారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న వైసీపీకి ప్రజలు బుద్ధిచెప్పారు. చంద్రబాబు కష్టాన్ని గుర్తించి ప్రజలు భారీ మెజారిటీతో టీడీపీని గెలిపించారు. చంద్రబాబునాయుడు ప్రభంజనం ఈ ఎన్నికల్లో కనిపించింది. 150 సీట్లు దాటినా ఆశ్చర్యం లేదు. ఆంధ్ర ప్రజల అభిమానానికి ధన్యవాదాలు అన్నారు. ఎన్నికల నిర్వహణ తీరుపై చంద్రబాబు పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని అన్నారు.
Tags:Babu’s struggle has motivated the leaders of all parties across the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *