బాబు కుటుంబమంతా అవినీతిలో మునిగిపోయింది
గుడివాడ ముచ్చట్లు:
నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేసారు. కొడాలి నాని మాట్లాడుతూ నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రాడు. చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు భువనేశ్వరి ఏ స్థాయిలో ఉంది. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు 2వేల కోట్లు దాటింది. 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు 35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారు. కష్టపడి పొలం దున్నగా వచ్చిన డబ్బుతోనే ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు.
Tags; Babu’s whole family is immersed in corruption

