Natyam ad

బాబుతోమాజీ ఎమ్మెల్యేలు యస్సీవీ నాయుడు ,మునిరామయ్య బేటీ

-ఇరువురు రాజకీయ భవిష్యత్తుకు హామీ

 

కుప్పం ముచ్చట్లు:


కుప్పం నియోజకవర్గంలో పర్యటనలో వున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనను వచ్చి కలవాలని ఇరువురు నేతలకు కబురు పెట్టారు. MLC రామ భూపాల రెడ్డి మంగళవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు సందేశాన్ని యస్సీవీ నాయుడు కు అంద జేశారు. ఆ మేరకు యస్సీవీ నాయుడు మునిరామయ్య యస్సీవీ దిలీప్ కుప్పం బుధవారం ఉదయం చేరుకున్నారు. యస్సీవీ నాయుడు మునిరామయ్య చంద్రబాబు నాయుడు తో ప్రత్యేకంగా బేటి అయ్యారు. చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్ లో వున్నా ఇరువురు మాజీ ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇరువురు నేతల సందేహాలను నివృత్తి చేసినట్లు తెలిసింది. ప్రధానంగా తిరుపతి పార్లమెంటు స్థానంలోని శాసన సభ నియోజకవర్గాల రాజకీయ పరిస్థితులు ఈ బేటీలో చర్చకు వచ్చాయి. ఇరువురు మాజీ ఎమ్మెల్యేలు ఎట్టి దాపరికం లేకుండా నియోజకవర్గాల్లోని పరిస్థితులు చంద్రబాబు నాయుడుకు నివేదించారని తెలిసింది . చంద్రబాబు నాయుడు కూడా వీరి వాదనతో ఏకీభవించినట్లు తెలిసింది. కొన్ని అనివార్య కారణాల వలన టిడిపి టికెట్ ఇవ్వలేక పోయినట్టు చంద్రబాబు నాయుడు యస్సీవీ నాయుడుకు చెప్పారట.

 

 

 

Post Midle

అయితే ఇప్పుడు అంత కన్నా ఎక్కువ బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు నాయుడు యస్సీవీ నాయుడుకు సూచించినట్లు తెలిసింది. శ్రీ కాళహస్తి సత్యవేడు సూళ్లూరుపేట వెంకటగిరి నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థుల గెలుపు కృషి చేయాలని చంద్రబాబు నాయుడు యస్సీవీ నాయుడు సూచించారట. ఇరువురు మాజీ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు తను చూచుకుంటానని కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడమే కాకుండా శ్రీ కాళహస్తి లో బహిరంగ సభలోనే పబ్లిక్ చెబుతానని కూడా చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు నాయుడుతో సమావేశం తర్వాత ఇరువురు మాజీ ఎమ్మెల్యేలు సంత్రుప్తి పడినట్లు కూడా చెప్పబడుతోంది.

 

Tags: Babutomaji’s MLAs Ysv Naidu and Muniramayya are daughters

Post Midle