Natyam ad

మదనపల్లిలో డాక్టర్ల నిర్లక్ష్యానికి శిశువు మృతి..

మదనపల్లి ముచ్చట్లు:


మదనపల్లిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా సోమవారం శిశువు మృతి చెందడంతో కలకలం రేపుతోంది.స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉండే బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో బి కొత్త కోట మండలం, ఆలేటిపల్లికి చెందిన రఘునాథ్ భార్య అంజలి గర్భందాల్చిన రోజు నుంచి చికిత్స తీసుకుంటోంది. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా అదనంగా డబ్బులు తీసుకుని ప్రసవచికిత్స సరిగా చేయకపోవడంతో శిశువు చనిపోయిందనిబాధితులు ఆరోపించారు.
ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత శిశువు చనిపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత వైద్యుల పై చర్యలు తీసుకుని బాధ్యతలకు న్యాయం చేయాలని టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు విచారిస్తున్నారు.

 

Tags: Baby died due to negligence of doctors in Madanapally..

Post Midle
Post Midle